తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం
15-06-2026 01:26 PM
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో(Telugu Film Chamber) సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సురేశ్ బాబు, దిల్ రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కు పర్సెంటేజీ విధానంపై సమావేశంలో చర్చించారు. జులై 3 నుంచి పర్సెంటేజీ విధానం అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. చిన్న సినిమాలకు ఐదో షో ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. చిన్న సినిమాలకు థియేటర్ల కొరత లేకుండా చూడాలని నిర్మాతలు కోరారు.






