9 April, 2026 | 2:10 AM

రాకాగా అల్లు అర్జున్!

09-04-2026 12:00 AM

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా డైరెక్టర్ అట్లీ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కి స్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్ల ఉంటా రని సమాచారం. ఇప్పటికైతే ఇందులో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్టు టీమ్ అధికారికంగా వెల్లడించింది.

ఇదిలావుండగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ క్రేజీ మూవీకి ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటంతో ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఇంతవరకు కనిపించని కొత్త అవతారంతో ఆశ్చర్యపరుస్తున్నారు. గుండుతో, వింత శరీరాకృతితో కనిపించి, అంచనాల్ని పెంచేశారు. 

ఇతర సినిమాలతో పోలికలు.. 

అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రకటించినప్పటి నుంచి సోషల్‌మీడియాలో పోలికలు, డీ కోడ్‌ల జోరు మొదలైంది. ఈ ‘రాకా’ గెటప్‌ను చాలా మంది ‘ఐ’ సినిమాలోని హీరో విక్రమ్ లుక్‌తో పోలుస్తున్నారు. పాత ఒనిడా టీవీ యాడ్‌ను గుర్తుకు తెస్తోందంటూ మరికొందరు సరదా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్ర డైరెక్టర్ అట్లీపై ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రభావం ఉంది. అయితే, శంకర్ ‘ఐ’ అనేది ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు. కాబట్టి ఆ సినిమాను స్ఫూర్తిగా తీసుకొనే పొరపాటు అట్లీ చేయడేమోనన్న విమర్శ వినవస్తోంది. ‘పుష్ప’ సిరీస్‌తో తన క్రేజీని పెంచుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమా కోసం తగిన జాగ్రత్తలు తీసుకొనే ఉంటాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.