ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ ఫీజులు, డొనేషన్లు, అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడంతో పాటు పుస్తకాలు, యూనిఫార్ములు నిర్దిష్ట దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజినపల్లి మండలం వాసి టి ప్రవీణ్ కుమార్ డిఇఓకు ఫిర్యాదు చేశాడు.
కనీస సౌకర్యాల లేమి, అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






