తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు
- తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఏనాడు అడ్డు చెప్పలేదు
- ఏపీని విభజించిన తీరుపై మాత్రమే ఆవేదన
- కాంగ్రెస్ విభజన తీరు.. అసంతృప్తి, అశాంతి
- కాంగ్రెస్ ధోరణి మారలేదు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన పార్టీ ఏనాడు అడ్డు చెప్పలేదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం భట్టి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... ఏపీని విభజించిన తీరుపై మాత్రమే ఆవేదన వెలిబుచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ విభజన తీరు.. అసంతృత్తి, అశాంతిని సృష్టించిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని విభజించిన నాటి నుంచి ఇవాళ్టికి కాంగ్రెస్ ధోరణి మారలేదని ఆరోపించారు. తెలంగాణలో జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి, ఢిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామని చాలామంది పెద్దమాటలు చెబుతున్నారని సూచించారు.వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.
కాక్రోచ్ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకువస్తుంది: పవన్
చాలా సార్లు మనకుమనం తక్కువగా అంచనా వేసుకుంటామన్న పవన్ కళ్యాణ్ ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తేవొచ్చని సూచించారు. ఈ మధ్య కాక్రోజ్ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నామన్నారు. కాక్రోచ్ పార్టీని చూస్తే... చలిచీమల పద్యం గుర్తుకువచ్చిందని పవన్ కళ్యాన్ తెలిపారు. చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వివరించారు. ఢిల్లీలోనే సమావేశం పెట్టడానికి కారణం ఢిల్లీ చరిత్ర గొప్పతనమని పేర్కొన్నారు. జనసేన పార్టీ దేశ భక్తికి ఎంత విలువ ఇస్తుందన్నది చెప్పాలన్నదే ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.






