విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు
23-04-2026 01:22 AM
నిజాంసాగర్ ఏప్రిల్ 22( విజయ క్రాంతి ) కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో నిర్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో, బుధవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, నాయకులు ప్రజాపండరి, మెంగారం శ్రీనివాస్,బంగ్లా ప్రవీణ్ గుర్రపు శ్రీనివాస్, అనీష్, సత్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






