6 July, 2026 | 11:06 AM

మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

06-07-2026 09:52 AM

మోదీ 3 దేశాల పర్యటన వ్యూహం ఏంటి?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మూడు దేశాల పర్యటనకు బయల్దేరారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తొలుత ఇండోనేషియా రాజధాని జకర్తా చేరుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 8 వరకు ఇండోనేషియాలో నరేంద్ర మోదీ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నెల 8,9 తేదీల్లో ఆస్ట్రేలియాలో, 10,11 తేదీల్లో న్యూజిలాండ్ లో ప్రధాని పర్యటించనున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వివిధ కార్యక్రమాలకు పీఎం మోదీ హాజరుకానున్నాను. ఈ విలువైన అభివృద్ధి భాగస్వామ్య దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం, అలాగే భవిష్యత్తులో మన దేశ యువతకు మరిన్ని అవకాశాలు లభించేలా చూడటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని ప్రధాని పేర్కొన్నారు.