3 July, 2026 | 9:34 PM

Breaking News

నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •  

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

12-03-2026 12:11 AM

ఆర్సీబీ, సన్ రైజర్స్ మధ్య ఆరంభ మ్యాచ్ 

20 మ్యాచ్‌లతో తొలి దశ షెడ్యూల్

ముంబై , మార్చి 11: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెం గళూరు(ఆర్సీబీ)తో మన సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్హెచ్) తలపడనుంది. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా 20 మ్యాచ్ల షెడ్యూల్నే బీసీసీఐ విడుదల చేసింది. బెంగళూరు, ముంబై, గువహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వేదికగా ఈ 20 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లు 03:30 గంటలకు, రాత్రి మ్యాచ్లు 07:30 గంటలకు ప్రారంభమవుతాయి.