12 March, 2026 | 5:51 AM

ర్యాంకింగ్స్‌

12-03-2026 12:13 AM

దూసుకొచ్చిన భారత క్రికెటర్లు

అభిషేక్ శర్మ @1, ఇషాన్ కిషన్  @2

18 స్థానాలు ఎగబాకిన సంజూ శాంసన్

దుబాయ్, మార్చి 11 : టీ20 ప్రపంచకప్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపారు. బ్యా టింగ్ విభాగంలో పూర్తి ఆధిపత్యం కనబరిచారు. టాప్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిష న్ చోటు దక్కించుకుంటే టాప్ 10లో మొత్తం గా నలుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ 875 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు.

నిజానికి ఈ మెగాటోర్నీలో అభిషేక్ విఫలమయ్యాడు. కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. వరుసగా ఫె యిలవుతున్నా కోచ్ గంభీర్ అతనికే అవకాశాలు ఇచ్చాడు. అయితే టైటిల్ పోరులో అభి షేక్ శర్మ ఆకట్టుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి భారత్ భారీస్కోరుకు పునాది వేశాడు.

ఈ ప్రదర్శనతో అతని నెంబ ర్ వన్ ర్యాంకు నిలబెట్టుకోగలిగాడు. ఇదిలా ఉంటే మరో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. టీ20 ప్ర పంచకప్‌లో అత్యంత నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప రుగుల వరద పారించాడు. 9 మ్యా చ్‌లలో 317 పరుగులు చేసి భారత్ తరపున సెకండ్ టాప్ స్కోర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో రెండు స్థానాలు ఎగబాకి టాప్ 2లో నిలిచాడు. ఇషా న్ కిషన్ కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంక్. మరోవైపు టాప్ 10లో మరో ఇద్దరు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం మారినప్పటకీ మెరుపులు మెరిపించిన తిలక్ వర్మ 742 పాయింట్లతో ఏడోస్థా నంలో కొనసాగుతున్నాడు. అటు కెప్టెన్‌గా ఆకట్టుకున్నా, వ్యక్తిగతంగా ఫెయిలైన సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ ప్లేస్‌లో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఓపెనర్ సంజూ శాం సన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకాడు.  ఆరంభంలో నిరాశపరిచిన సంజూ టోర్నీ చివర్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. కేవలం 5 మ్యాచ్‌లలోనే 80కి పైగా సగటు తో 321 పరుగులు చేసిన సంజూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

ఈ ప్రదర్శనతో ఏకంగా 18 స్థానాలు దూసుకొచ్చిన సంజూ శాంసన్ 22వ స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. వరుణ్ చక్రవర్తి అగ్రస్థానం నుంచి రెం డో స్థానానికి పరిమితమయ్యాడు. తాజా జాబితాలో వరుణ్ 740 పాయింట్లతో సెకం డ్ ప్లేస్‌లో నిలిస్తే, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 753 పాయింట్లతో అగ్రస్థానానికి దూ సుకొచ్చాడు.

అయితే టీ20 ప్రపంచకప్ భార త్ తరపున నిలకడగా రాణించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగై ఆరో ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం బుమ్రా ఖా తాలో 702 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్ 10లో కేవలం ఇద్దరు భారత బౌలర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. మిగిలిన భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 16వ ర్యాం కులో కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఆరు స్థానాలు మెరుగై 17వ ర్యాంకులో నిలిచాడు.

ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో జింబాబ్వే ప్లేయ ర్ సికిందర్ రజా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా రెండో స్థానం లో నిలిచాడు. మరో భారత ఆల్‌రౌండర్ శివ మ్ దూబే 11వ ర్యాంకులో నిలిచాడు. కాగా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తిరుగులేని ఆధిపత్యంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 85 మ్యాచ్‌లలో 23,224 పాయింట్లతో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.