3 July, 2026 | 8:42 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

కింగ్ ప్రాక్టీస్ షురూ

12-03-2026 12:08 AM

లండన్, మార్చి 11 : ఐపీఎల్ 2026 సీజ న్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కోహ్లీ తాజాగా నెట్స్‌లో తీవ్రం గా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.  ‘ఐపీఎల్ 2026’ అని క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో సో షల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లీ చివరిసారిగా గత జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ ఒక సెంచరీ, అర్థసెంచరీ సాయంతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ భారత్ మాత్రం 1-2 తేడాతో కివీస్‌కు సిరీస్ కోల్పోయింది.

గత ఏడాది ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచింది. ఆ సీజన్‌లో కోహ్లీ 144 ్రస్ట్రుక్‌రేట్‌తో  657 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ వచ్చిన కోహ్లీ మొత్తంగా  8,661 పరుగులు సాధించాడు. ఇక గతేడాది తొలిసారి టైటిల్ సాధిం చిన బెంగళూరు జట్టు మరోసారి దానిని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్ సీజన్ షురూ కావాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇంకా షెడ్యూ ల్ విడుదల చేయలేదు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కా రణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసు ల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడడం, ఎల్పీజీ సంక్షోభంతో బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూతపడడం లాంటి కారణాల వల్ల అసలు అనుకు న్న సమయానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుందా లేదా అనేది తెలియడం లేదు.