calender_icon.png 8 February, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం హుండీ ఆదాయం రూ.2.01 కోట్లు

08-02-2026 12:44:01 AM

హనుమకొండలో 140 హుండీల లెక్కింపు

మేడారం, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలను హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమంటపంలో లెక్కిస్తున్నారు. శనివారం 140 హుండీలను లెక్కించారు. రూ.2,01,21,440 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో వీరస్వామి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ ద్వారా 71, 283 రూపాయల ఆదాయం లభించినట్లు చెప్పారు. మూడు రోజులుగా మొత్తం 425 హుండీలను లెక్కించగా ఇప్పటివరకు 8,06,46,359 రూపాయల ఆదాయం లభించినట్లు చెప్పారు. మొత్తం 828 హుండీలను లెక్కించాల్సి ఉండగా, ఇప్పటివరకు 425 హుండీలను లెక్కింపు పూర్తి చేశారు.