ఎన్నికల హామీని నెరవేరుస్తున్న సర్పంచ్
14-05-2026 04:51 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం మొక్కంపాడు గ్రామా సర్పంచ్ బానోత్ సురేష్ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేస్తున్నారు. గురువారం మొక్కంపాడు తండాకు చెందిన బానోత్ వెంకన్న- జ్యోతి ల ప్రథమ పుత్రిక మాధురి వివాహం జరిగింది. ఆ వివాహంలో మేనమామ పెళ్లికానుకగా ₹5116 నగదును పెళ్లి పందిరిలో గ్రామస్తుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్బంగా మొక్కంపాడు సర్పంచ్ బానోత్ సురేష్ మాట్లాడుతూ గ్రామస్థులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరస్తానని వారికీ అందుబాటులో ఉంటూ, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తానని తెలిపారు.






