14 May, 2026 | 6:05 PM

కుమ్మర్ల హక్కుల కోసం పోరాటం

14-05-2026 04:52 PM

భైంసా, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరి వృత్తి పరిరక్షణ హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 17న రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్ ప్రధాన కార్యదర్శి కే సతీష్ తెలిపారు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో 33 జిల్లాల కుమ్మరి సంఘ ప్రతినిధుల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి దయానంద్ ప్రముఖులు హాజరవుతారన్నారు. కుమ్మరి వృత్తి పరిరక్షణ ప్లాస్టిక్ నియంత్రణ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు తదితర డిమాండ్ల సాధన కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కుమ్మరి సోదరులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ పాల్గొన్నారు