14 May, 2026 | 6:05 PM

బడి మీదే.. బాధ్యత మీదే

14-05-2026 04:54 PM

నిర్మల్ మే 14 ( విజయ క్రాంతి):  సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామంలో బడి ఉండాలని విజ్ఞానాన్ని అందించే బడిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదేనని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన అన్నారు. గురువారం విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ దిల్వార్పూర్ సారంగాపూర్ నర్సాపూర్ మండలాల్లో నిర్వహించిన బడిబాట అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తమ పిల్లలను తప్పకుండా చదివించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.