calender_icon.png 8 February, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలంతా మా వైపే

08-02-2026 12:35:42 AM

-పదవి ముఖ్యం కాదు.. వార్డు అభివృద్ధే లక్ష్యం 

-వనపర్తిలోని 19వ వార్డు స్వంత్రంత్ర అభ్యర్థి ప్యాట తిరుపతయ్య 

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): పదవి అనుభవించాలని ఉద్దేశ్యంతో రాలేదని.. పదవులు శ్వాశతం కాదని.. వార్డు అభివృద్ధే నా లక్ష్యంగా మీ ముందుకు స్వత్రంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నానని అందరు ఆశీర్వదించి ఆపిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 19 వ వార్డు స్వత్రంత్ర అభ్యర్థి ప్యాట తిరుపతయ్య వార్డు ప్రజలను కోరారు. శనివారం 19వ వార్డులో ప్రజలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా తిరుపతయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో పర్యటిస్తున్న సమయంలో వార్డులోని ప్రజలంతా ముక్తకంఠంతో మేమంతా మీ వెంటే ఉన్నామని చెబుతున్నారని అన్నారు. ఇదంత వాళ్ల ప్రేమ,  అభిమానం మరువలేనిదన్నారు. పదవుల కోసం తాను పోటీలోకి రాలేదని.. వార్డు అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వచ్చానని వార్డు లోని ప్రతి ఒక్కరు నా కుటుంబసభ్యులని వారి అభివృద్ధి కోసం అనుక్షణం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

తనకు చదువు రాదని కొంత మంది హేళన చేస్తున్నారని చదువు రాకపోతే ప్రజలకు అభివృద్ధి చేయడానికి అర్హత ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడానికి విద్య అనేది అర్హత కాదని సేవ చేయాలన్న సంకల్పం ఉంటే చాలని వార్డు లోని సమస్యలు తెలిసిన వ్యక్తిగా వాటిని ఏ విధంగా పరిష్కరించాలో, ప్రభుత్వంతో, అధికారులతో ఎలా పని తీసుకోవాలో తనకు తెలుసునన్నారు. బ్యాలెట్ లో గల తన గుర్తు ఆపిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్యాట తిరుపతయ్య వార్డు ప్రజలను కోరారు.