14 May, 2026 | 5:55 PM

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

14-05-2026 05:03 PM

ఖానాపూర్ ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. గురువారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 1089 మంది విద్యార్థులకు గాను 10 24 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని తెలిపారు