calender_icon.png 8 February, 2026 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లోనే భూమి రిజిస్ట్రేషన్

08-02-2026 12:45:39 AM

వృద్ధురాలి ఇంటికెళ్లి భూమి రిజిస్ట్రేషన్ చేసిన మెట్‌పల్లి తహసీల్దార్ 

మెట్‌పల్లి, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు ఇంటికే వెళ్లి మెట్‌పల్లి తహసీల్దార్ నకుమల్ల నీత భూమి రిజిస్ట్రేషన్ చేశారు. వెంపేట్ గ్రామానికి చెందిన సుద్దాల అనసూయ (70) గత ఏడు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితం అయ్యారు.

ఆమె తన పేరుపై ఉన్న నాలుగు ఎకరాల పది గుంటల భూమిని తన ఇద్దరు కొడుకులకు రిజిస్ట్రేషన్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. కానీ అన సూయకు నడవడానికి కూడా వీలుకాపోవడంతో విషయం తహసీల్దార్‌కు ఆమె కుమారులు తెలిపారు. దీంతో తహసీల్దార్ శనివారం తన సిబ్బం దితో కలిసి వెంపేటలోని ఆమె ఇంటికి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ చేశారు. తహసీల్దార్ మనవతా దృక్పథంతో అర్జీదారుల ఇంటికే వెళ్లి రిజిస్ట్రేషన్ చేయ డంతో పలువురు అభినందనలు తెలిపారు.