10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మున్సిపోల్స్‌లో టీఆర్పీ ప్రభావం

14-02-2026 12:52 AM

ప్రధాన పార్టీలకు ఎదురు దెబ్బ!

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పోటీ చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్పీ అభ్యర్థులు అనేక స్థానాల్లో గెలుపోటములపై ప్రభావం చూపుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల విజయాలను అడ్డుకున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నా యి.

1628 స్థానాల్లో కాంగ్రెస్‌కు 55.77% ఓటమి శాతం, 2,164 స్థానా ల్లో బీఆర్‌ఎస్ ఓటమి (76.06% స్థానా ల్లో), 2,379 స్థానాల్లో బీజేపీ (91.44% స్థానా ల్లో ఓటమి) ఉండగా టీఆర్పీ కేవలం 108 స్థానా ల్లో మాత్రమే ఓటమి (మొత్తం శాతంలో 3.06%) గా ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సూర్యాపేట ము న్సిపాలిటీలో 1వ వార్డులో బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన టీఆర్పీ 87 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ ఓడిందని, టీఆర్పీకి 700 ఓట్లు వచ్చాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక 13వ వార్డులో బీఆర్ ఎస్‌పై టీఆర్పీ పైచేయి సాధిం చిందని, టీఆర్పీకి 901 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 483 ఓట్లు వచ్చాయని తెలిపా యి. 20వ వార్డులో టీఆర్పీ 4వ స్థానం లో ఉన్నదని, 24వ వార్డులో బీజేపీని వెన క్కి నెట్టి టీఆర్పీ ముం దంజలో ఉన్నదని, 31, 33, 34, 40వ వార్డుల్లో టీఆర్పీ 4వ స్థానాల్లో నిలిచి, గెలిచే పార్టీలను ఓడించగలిగిందని పేర్కొన్నాయి. 43వ వార్డు లో కాంగ్రెస్‌పై టీఆర్పీ ప్రభావం చూపి, కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టిందని తెలిపాయి.

జనగామ మున్సిపాలిటీలో 5వ వార్డు లో కాంగ్రెస్ గెలుపును టీఆర్పీ అడ్డుకుందని, కేవలం 10 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓటమి చెందగా, టీఆర్పీ 3వ స్థానంలో నిలిచిందని వెల్లడించాయి. భూత్పూర్ మున్సిపాలిటీలో 3వ వార్డు లో టీఆర్పీ పోటీ ప్రభావంతో ఈ వార్డు లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి చెందిందని, భూపాల పల్లి మున్సిపాలిటీలో 18వ వార్డులో టీఆర్పీ పోటీ చేయడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలైందని, ఈ వార్డులో టీఆర్పీ 4వ స్థానంలో నిలిచిందని తెలిపాయి.

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 5వ వార్డులో టీఆర్పీ 464, కాంగ్రెస్ 486 ఓట్లు సాధించిందని, కేవలం 22 ఓట్లతో తృటిలో టీఆర్పీ అభ్యర్థి ఓడిపోయారని పేర్కొన్నాయి. ఈ వార్డులో బీఆర్‌ఎస్ 144, బీజేపీకి డిపాజిట్ గల్లంతయ్యిందని, 8వ వార్డులో బీజేపీను నెట్టేస్తూ మూడో స్థానంలోకి టీఆర్పీ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.