వారసులు వచ్చేశారు
- అండర్ 19 జట్టులోకి ద్రవిడ్, సెహ్వాగ్ కుమారులు
- ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక
ముంబై , ఆగస్టు 27 : ఆస్ట్రేలియా అండ ర్-19(Australia Under-19) జట్టుతో జరగనున్న మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ భారత అండర్-19(BCCI India Under-19) జట్లను ప్రకటించింది. ఈ వన్డే జట్టులో భారత దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కొడుకు అన్వయ్ ద్రవిడ్లకు చోటు ల భించింది. వన్డేలకు లక్ష్య రాయ్చందానీ, మల్టీ-డే మ్యాచ్లకు యశ్వర్ధన్ చౌహాన్ కెప్టెన్లుగా వ్య వహరిస్తారు.
మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ వికెట్ కీప ర్ బ్యాటర్‌గా జట్టులోకి ఎంపికయ్యాడు. గత జూలైలో జరిగిన శ్రీలంక పర్యటనలోనూ భారత్ అండర్-19 జట్టులో భాగమైన అన్వ య్, రెండో వన్డేలో 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు.
మరోవైపు డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన ప్రతిభతో సెలక్టర్లను మె ప్పించి తొలిసారి అండర్-19 వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌తో మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుం ది. సెప్టెంబర్ 19న రాజ్‌కోట్ వేదికగా తొలి వన్డే ప్రారంభమవుతుంది.






