28 August, 2026 | 8:42 AM

దినుషా అద్భుత పోరాటం

28-08-2026 12:40 AM
  1. రెండో టెస్ట్ డ్రా
  2. భారత్‌కు లంక టెయిలెండర్ల షాక్
  3.    1--0తో సిరీస్ గెలిచిన భారత్ 
  4. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం

* కొలంబో టెస్టులో భారత్‌కు లంక షాకిచ్చింది. గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌లో సోనాల్ దినుషా అద్భుత పోరాటం, టెయిలెండర్ల పట్టుదల కలిసి భారత్‌కు విజయాన్ని దూరం చేశాయి. దీంతో లంక డ్రాతో గట్టెక్కితే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. కానీ 2-0 విజయం దక్కకపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

కొలంబో, ఆగస్టు 27 : రెండో టెస్టులో శ్రీలంక(Sri Lanka) అద్భుత పోరాటం కనబరిచింది. 229/6 ఓవ్నట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆట ను ప్రారంభించిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను సోనాల్ దినుషా(Sonal Dhinusha) ముందుకు నడిపించాడు. తొలి సెషన్‌లోనే ఫలితం తేలుతుందని భారత్ భావించగా.. సోనాల్ దినుషా, కేశర నువాంత అడ్డుగోడగా నిలిచారు. భారత బౌలర్ల(Indian bowler) సహనానికి పరీక్షగా నిలిచారు. 32 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ.. తొలి సెషన్‌లో 100 పరుగులు జోడించారు.

దాంతో శ్రీలంక 329/6 స్కోర్‌తో లంచ్ బ్రేక్ కు వెళ్లింది. రెండో సెషన్‌లో కేశర ను వాంత ఔటవ్వడంతో ఏడో వికెట్‌కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరప డింది. ఆ వెంటనే ప్రభాత్ జయసూర్య కూ డా ఔటవ్వడంతో భారత శిబిరంలో ఆశలు చిగురిం చాయి. కానీ లాహిరు కుమారతో కలిసి సో నాల్ దినుషా ఇన్నింగ్స్‌ను కొనసాగించారు.. జిడ్డుగా ఆడిన ఈ జోడీ.. భారత బౌలర్ల స హనాన్ని దెబ్బతీసింది. ఆఖరి సెషన్‌లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించిన శ్రీలంక 400 పరుగుల మార్క్‌ను అందుకుంది.

196 బంతుల్లో దినూషా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో దినుషా చరిత్ర సృష్టించాడు. భారత్‌పై వరుసగా మొదటి నాలుగు టెస్ట్ ఇన్నింగ్స్‌లో 50+ స్కోర్లు న మోదు చేసిన తొలి ఆసియా బ్యాట ర్‌గా నిలిచాడు. కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించా డు. తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లో 100, 84 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా భారత్‌పై మొదటి నాలుగు ఇన్నింగ్స్‌లో 50 ప్లస్ స్కో ర్లు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.

డగ్లస్ జార్డిన్, ఎవర్టన్ వీక్స్, క్లైడ్ వా ల్కట్, కెన్ బారింగ్టన్.. సోనాల్ దినుషా కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. ఇదిలా ఉం టే 90 బంతులాడిన లాహిరు కుమారను జడేజా ఔట్ చేసినా ఫలితం లేకపోయింది. అసితా ఫెర్నాండో(0 నాటౌట్) కలి సి దిను షా మరో 10 ఓవర్లు ఆడగా.. శ్రీలంక డిక్లేర్ చేసింది.

రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు తగిన ఓవర్లు లేకపోవడంతో.. శుభ్మన్ గిల్ షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాకు అంగీకరించాడు. కా గా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించి టీమిండియా తప్పు చేసిందా అనే చర్చ జరుగుతోంది. శ్రీ లంక ముందు భారీ లక్ష్యం పెట్టి బ్యాటింగ్ చేయించి ఉంటే.. ఒత్తిడిలో వారు ఔటయ్యేవారని, కానీ ఫాలో-ఆన్ ఆడించడం తో ఎ లాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 503/9 డిక్లేర్డ్ (పడిక్కల్ 117, జురెల్ 115, పంత్ 63, గిల్ 50, జడేజా 43, అసితా ఫెర్నాండో 4/106)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 290 (సోనాల్ దినుషా85 బ్యాటింగ్, సూర్యబండార 80, ప్రసిద్ధ కృష్ణ 3/47 మానవ్ సుతార్ 3/87)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 429/6 (పసిందు సూర్యబండార92,  సోనాల్ దినుషా 133 నాటౌట్,  కామిందు మెండీస్ 55, మానవ్ సుతార్ 3/121, జడేజా 3/94)