29 May, 2026 | 2:54 AM

ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు వెంటనే విడుదల చేయాలి

29-05-2026 01:58 AM

టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అనేక ఉపాధ్యాయ, ఉద్యోగ రంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. 

కొద్ది నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ పరిస్థితుల అనిశ్చితి, జరుగుతున్న ఉపాధ్యాయ ఉద్యమాలకు సంబంధించిన రిపోర్టును ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రవేశ పెట్టారు. ఈ సమావేశంలో పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ హెచ్ ఎస్ కు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన విది విధానాలు వెంటనే విడుదల చేసిన అనంతరమే జేఏసీ ఒప్పందం మేరకు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కోరాలని ఆన్నారు. పి ఆర్ సి నివేదికను తెప్పించుకొని వెంటనే అమల్లోకి తేవాలన్నారు.

5 కరువు భత్యాలను కొత్త పి ఆర్ సి లో సవరించబడే శాతం మేరకు చెల్లించాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు బదులుగా ఉన్న పాఠశాలల బాగోగుల పై దృష్టి సారించి, మెరుగైన విద్యా కోసం కృషి చేయాలన్నారు.   ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులతో పాటు అసోసియేట్ అధ్యక్షులు జీ తిరుపతి రెడ్డి,అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, ఉపాధ్యక్షులు, పి.నారాయణమ్మ, డి.శ్రీనివాస్,  ఎం.లక్ష్మయ్య యాదవ్, బి.రాజు, కార్యదర్శులు: రావుల రమేష్, ఎస్.విజయ్, బి.రమేష్, డి రాజయ్య, వై పద్మ లు పాల్గొన్నారు.