1 June, 2026 | 3:29 AM

అతి పెద్ద గృహ విప్లవం

01-06-2026 01:06 AM
  1. ఇందిరమ్మ ఇళ్లతో దేశానికే తెలంగాణ మార్గదర్శకం
  2.   13 నెలల్లో లక్ష ఇండ్లు పూర్తి 
  3. రెండు నెలల్లో మరో 2 లక్షలు ఇండ్లు అందుబాటులోకి తీసుకువస్తాం
  4.   1న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రెండవ విడతకు శ్రీకారం 
  5. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద గృహ నిర్మాణ విప్లవంగా నిలుస్తోందని హౌజింగ్, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఈ పథకం పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 

తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 అక్షలకు పైగా ఇండ్ల ను మంజూరు చేశామని, జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కరిమెర మండలం కొఠారి గ్రామంలో రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రెండో విడతకు శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. అలాగే  కొత్తగూ డలో సామూహిక గృహప్రవేశాలు ఉంటాయని, ఈ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు.

మలివిడతలో మంజూరు చేసిన 2.5 లక్షల ఇండ్లతో కలిపి రెండు దశల్లో ప్రతి నియోజకవర్గానికి 5,500 నుంచి 6,500 ఇండ్లు మంజూరు చేసినట్లు అవుతుందని వెల్లడించారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గా లకు అదనంగా 500 నుంచి 1,500 వరకు ఇండ్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. తాము ఆశించిన విశంగానే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. 

కేంద్రం ఇచ్చేది పరిమిత నిధులే..

13 నెలల్లో లక్ష ఇండ్లు పూర్తయ్యాయని, ఒకటి రెండు నెలల్లో మరో 2 లక్షల గృహాలు పూర్తవుతాయని.. ఇది దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. 2026--27 ఆర్థ్ధిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లకు, రాష్టంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. దేశంలో ని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలను చేపడుతున్నాయని, తెలంగాణ సర్కార్ మాత్రం ప్రతి పేదవాడి ఇంటి నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకొని పూర్తి చేస్తున్నట్లు వివరించారు. 

ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మాత్ర మే ఇస్తుందని, తమ ప్రభుత్వం ఒక్కో ఇంటి కి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరై అసంపూర్తిగా ఉన్న వాటి ని కూడా పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు.

దీంతోపాటు 2023లో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల పూర్తికి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఇందిరమ్మ పథకంలో 20 వేల వరకు ఆర్థ్ధికసాయం పొందినవారికి కూడా ఇండ్ల మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.