మహా దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే
- వారి ఆశయాల సాధన కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి
బీసీ కులాల ప్రగతి కోసం పదేండ్లలో విప్లవాత్మక పథకాలు అమలు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన భారతదేశ సామాజిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన మార్గదర్శి, మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. ఫూలే జయంతి సందర్భంగా చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. భారత సమాజంలో వర్ణ, కుల లింగ వివక్షతను రూపుమాపి, సామాజిక న్యాయం దక్కాలని పోరాడిన దార్శనికుడు మహాత్మా ఫూలే అని పేర్కొన్నారు.
తన భార్య సావిత్రిబాయి ఫూలేకు చదువు నేర్పించి మరీ, చదువు నిరాకరించబడిన భారత మహిళలకు విద్య నేర్పాలనే దృఢ సంకల్పాన్ని అనేక కష్టనష్టాల నడుమ అమలు చేసిన, మహిళాభ్యుదయ మార్గదర్శి మహాత్మా ఫూలే అని కొనియాడారు.
ఫూలే ఆశయాలను నిజం చేస్తూ, తన పదేండ్ల ప్రగతి పాలనలో, నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అమలు చేసి ఫలితాలను సాధించిన పలు రకాల పథకాలను కార్యాచరణను కేసీఆర్ గుర్తు చేసుకు న్నారు. పలు వృత్తికులాలను ప్రోత్సహిస్తూ గొర్రెల పెంపకం, చేపల పంపిణీ, నేతన్నకు చేయూత వంటి పథకాలను అమలు చేయడం ద్వారా నూటికి 90 శాతంగా వున్న దళిత బహుజన కులాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని పేర్కొన్నారు.
బీసీ బిడ్డల భవిష్యత్ తరాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు రాష్ట్ర రాజధాని నగరం హైదరా బాద్‌లో ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం, అత్యంత విలువైన స్థలాలను, నిర్మా ణ నిధులను, బీసీ కుల సంఘాలకు కేటాయించినామని తెలిపారు. తద్వారా మాత్ర మే మహాత్మా ఫూలేకు మనం ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఫూలే: కేటీఆర్
మహిళా సాధికారత, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఫూలే జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన కేటీఆర్, సమాజంలో వి ద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా ఫూలే చేసిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
భావితరాలకు ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పా ల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనలో భాగంగానే గత కేసీఆర్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు మీద బీసీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను భారీగా ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినట్లు వివరించారు. అంతేకాకుండా, బీసీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలనే లక్ష్యంతో ఫూలే పేరు మీద విదేశీ విద్యా స్కాలర్‌షిప్‌లను కూడా కేసీఆర్ సర్కార్ అందజేసి, గౌరవించిందని ఆయన తను ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో వెల్లడించారు.




