12 April, 2026 | 2:24 AM

మహిళలు నాయకులుగా ఎదగాలి

12-04-2026 12:27 AM
  1. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా
  2. ‘కుర్చీయే కాదు .. కుర్చీని షేక్ చేసేలా ముందుకొస్తున్నారు..
  3. హెచ్‌ఎంఏ అసోసియేషన్ అధ్యక్షుడు అల్వాల దేవేందర్‌రెడ్డి 
  4. మహిళల నాయకత్వ వికాసంపై బేగంపేటలో ‘ఎమర్జ్’ సమ్మిట్

హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, మహిళలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగానే కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు.

‘హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్’.. మేనే జ్మెంట్ గురించి హైదరాబాద్‌లో అన్ని రం గాల వ్యక్తులకు, విద్యార్థులకు అలాగే కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి కెపాసిటీని పెంచేందుకు రకరకాల ప్రోగ్రా మ్స్ నిర్వహిస్తోంది.ముఖ్యంగా 2025-26 సంవత్సరానికి ‘మేనేజ్మెంట్ ఇన్ ఏఐ ఎరా’ అనే థీమ్తో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేనే జ్మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసి యేషన్ (ఏఐఎంఏ) అనుసంధానంతో నారీ శక్తి గురించి ‘ఎమర్జ్’ పేరిట హైదరాబాద్ బేగంపేట్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో శనివారం భారీ సదస్సు నిర్వహించారు.

‘వుమెన్ డెవలప్మెంట్ నుంచి వుమెన్- లీడ్ డెవలప్మెంట్’ అనే థీమ్తో నిర్వహించారు. ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు (ఏఐ), విధానాలు (పాలసీ), పారిశ్రామిక రంగం (ఎంట్ర ప్రెన్యూర్షిప్), నాయకత్వం (లీడర్‌షిప్), ఆరోగ్యం (వెల్‌నెస్) వంటి అంశాలపై నిపుణులు విస్తృతంగా చర్చించారు. ఈ సంద ర్భంగా వివిధ రంగాలకు చెందిన వక్తలు సదస్సులో పాల్గొని తమ ఆలోచనలు పంచు కున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ ‘వుమెన్ డెవలప్మెంట్’ అంటే  మహిళల భాగస్వామ్యం మాత్రమే కాదు.. మహిళలు కార్యక్రమాల్లో పాల్గొనేవారుగానే కాకుండా, లీడర్‌షిప్ పొజీషన్లలోకి వచ్చి కార్పొరేట్ వ్యవస్థలో గానీ, వ్యాపార రంగంలో గానీ ముందుకు రావాలని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఆల్వాల దేవేందర్ రెడ్డి  మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో పెరుగుతుండగా, కొత్త తరం మరింత ఉత్సా హంతో ముందుకు వస్తోంది అన్నారు.

ఇ లాంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి అని పేర్కొన్నారు. ముఖ్యంగా స్టార్టప్లలో కూడా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.‘కుర్చీయే కాదు.. కుర్చీని షేక్ చేసేలా మహిళలు ముందుకొస్తున్నారు.. దేశంలో ఈ విషయంలో తెలం గాణ ముందంజలో ఉంది అన్నారు. ‘కామినేని ఆస్పత్రుల సీవోవో గాయత్రి కామినేని కుటుంబ విజయాలు, వ్యాపార అభివృద్ధి అంశాలపై మాట్లాడారు.

ఫ్యూచరిస్టిక్ సిటీ డైరెక్టర్ కరుణ గోపాల్ మాట్లాడుతూ.. ఎంట్రప్రెన్యూర్షిప్ వైపు మహిళలు ముం దుకు రావాలని పిలుపునిచ్చారు. గూగుల్ హెడ్ చిత్ర సూడ్ మాట్లాడుతూ.. సదస్సులో టెక్నాలజీ, కృత్రిమ మేథస్సు (ఏఐ), పాలసీ, కార్పొరేట్ ప్రపంచంలో అడ్డంకుల అధిగమనం, ఆరోగ్యం, వెల్‌నెస్ వంటి అంశాలపై  మహిళలు దృష్టి పెట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఏ అసోసియేషన్ అధ్యక్షు డు అల్వాల దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శరత్ చంద్ర మారోజు, కార్యదర్శి వాసుదేవన్ జి, ఖజాంచీ రమేష్ లక్ష్మణన్, జాయిం ట్ సెక్రటరీ వందనా సంబ, కన్వీనర్ చేతనా జైన్ తదితరులు పాల్గొన్నారు.