12 March, 2026 | 6:54 AM

మీది కూల్చే ప్రభుత్వం మాది కట్టించే ప్రభుత్వం

12-03-2026 01:22 AM

* 311 మంది వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల పట్టాలు, ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ

  1. పేదలకు నీరు, విద్యుత్ సౌకర్యం 
  2. బీఆర్‌ఎస్ ఎందుకు కల్పించలేదు? 
  3. మానవీయ కోణంలో వెలుగుమట్ల పేదలకు న్యాయం
  4. అర్హులకు స్థలంతోపాటు ఇళ్లను నిర్మించి ఇస్తాం
  5. నేటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
  6. డిసెంబర్ 9 కల్లా మోడల్ కాలనీ ఏర్పాటు
  7. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా గృహప్రవేశం 
  8. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క
  9. పేదల ముసుగులో దోపిడీ చేసిన ఏ ఒక్కర్ని వదలం: మంత్రి పొంగులేటి
  10. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తాం: మంత్రి తుమ్మల 
  11. భూమాఫియా ఆట కట్టించాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఖమ్మం/కూసుమంచి, మార్చి 11 (విజయక్రాంతి): భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చేసి, పేదలను నిరాశ్రుయులను చేసిన ఘనత గత బీఆర్‌ఎస్ పాలకులదైయితే.. పేదలను గుర్తించి పట్టాలను అందించి, ఇండ్లను మంజూరు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, వాళ్లది కూల్చే ప్రభుత్వమయితే, తమది కట్టించే ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

బుధవారం ఖమ్మం ఐడీవోసీలో 311మంది వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మలోతు రాందాసునాయక్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కలెక్టర్‌తో కలిసి పంపిణీ చేశారు. వివిధ జిల్లా ల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేశారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వెలుగుమట్ల పేదల నిస్సాహాయత ఆసరాగా కొంద రు రాజకీయాలు చేశారని, రూ.లక్షల్లో వసూ లు చేసి మోసం చేశారని మండిపడ్డారు. పదే ళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ వెలుగుమట్ల పేదలకు నీరు, విద్యుత్ సౌకర్యం ఎందుకు కల్పించలేదు అని నిలదీశారు. తాము మానవీయ కోణంలో వెలుగుమట్ల పేదలకు న్యా యం చేస్తున్నామని, అర్హులకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.

వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగి లిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు. కరెంటు, నీళ్లు, రోడ్లు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గురువారం నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి, డిసెంబర్ 9 కల్లా మోడల్ కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 9న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుపుతామని చెప్పారు. ఇల్లు కట్టిస్తా మని పదేళ్లు అధికారంలో ఉండి మోసం చేసిన వారు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని, అలాంటి వారికి తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వెలుగుమట్లలో మాఫియా పేదల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి కనీస సౌకర్యాలు లేకుండా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. 

మోడల్ కాలనీ నిర్మిస్తాం: తుమ్మల

నిరుపేదల కోసం భూదాన్ భూములను ఉపయోగిస్తామని, వెలుగుమట్లలో మోడల్ కాలనీని నిర్మిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ప్రారంభిస్తామని, డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా గృహ ప్రవేశాలు ఉంటాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనపై పేదల సంఘం ఆరోపణలు చేశారని, పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

వెలుగుమట్ల పేదలను కొన్ని ముఠాలు మోసం చేశాయని అన్నారు. భూదాన్ ట్రస్టు సభ్యులుగా చెప్పుకొని కొంద రు మోసం చేసినట్లు ఆరోపించారు. ఇన్నాళ్లు కోర్టులో ఉన్నందువల్లే వెలుగుమట్లలో సదుపాయాలు కల్పించలేకపోయినట్లు తెలిపారు. కోర్టు తీర్పు మేరకే ఇక్కడి భూముల్లో ఉన్నవారిని కలెక్టర్ ఖాళీ చేయించాల్సి వచ్చిందన్నారు. ఖాళీ చేయించే సమయంలో పేదలపై ఒక్క లాఠీ దెబ్బ పడొద్దని చెప్పామన్నారు. భూదాన్ భూములను ఎప్పటికైనా పేదలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. 

భూ బకాసురులపై చర్యలు తీసుకోండి: తీన్మార్ మల్లన్న

వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేసినందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబాలను తాను స్వయంగా వెళ్లి పరామర్శిం చానని, వారి పరిస్థితిని తెలుసుకున్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి భూదాన్ భూ ముల విషయంలో భూ బకాసురుల ముఠా లు చేస్తున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించినట్టు పేర్కొన్నారు.

భూములు తిరిగి ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తానని హామీ ఇచ్చానని, ఆ పోరాటానికి ఫలితంగా ప్రభుత్వం బాధితులకు పట్టాలు మంజూరు చేయడం సంతోషకరమని చెప్పా రు. తాను పరామర్శకు వెళ్లిన సమయంలో మానసిక దివ్యాంగుడైన కొడుకుతో తల్లి అయిన శైలజ తన వద్దకు వచ్చిందని, “నేను కూడా బాధితురాలినే. రామయ్య అనే వ్యక్తి నా దగ్గర లక్ష రూపాయలు వసూలు చేశాడు. నేను ఇక్కడే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాను” అని ఆ తల్లి తన బాధను చెప్పిందన్నారు.

ఆ మహిళకు కూడా ప్రభుత్వం ఇండ్ల పట్టా ఇవ్వాలని కోరారు. వెలుగుమట్ల బాధితుల నుంచి ముఠాగా ఏర్పడి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న దానిపై తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని మల్లన్న తెలిపారు. కేవలం ఇండ్ల స్థలాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయి కాలనీగా అభివృద్ధి చేయాలని మల్లన్న సూచించారు. ఇంకా మిగిలిన బాధితులను ఏ పథకం కింద అరులుగా ప్రకటిస్తారో స్పష్టంగా తెలియజేసి వారికి కూడా న్యాయం చేయాలని మల్లన్న సూచించారు.

ఎక్కడైనా పేద ప్రజలు దీర్ఘకాలంగా గుడిశలు లేదా షెడ్లు వేసుకుని నివ సిస్తుంటే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించకుండా మానవతా దృక్పథంతో వ్యవ హరించాలని మల్లన్న కోరారు. బాధితుల ఇండ్లను కూల్చివేసినందున వారికి సాధారణ డబుల్ బెడ్‌రూం ఇండ్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో ప్రత్యేక పథకం కింద ఇండ్లు నిర్మించాలని మల్లన్న కోరారు.

కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్ నీరజ, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ పాల్గొన్నారు.

ఏ ఒక్కర్ని వదలం: పొంగులేటి 

భూదాన్ భూముల పంపకాల విషయంలో పేదల నుంచి డబ్బులు వసూ లు చేసిన ఏ ఒక్కర్ని వదిలేది లేదని, కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. పేదల ప్రభుత్వం మాదని, పేదలను దోచే ప్రభుత్వం గత పాలకులదని పొంగులేటి విమర్శించారు. ఏ జిల్లా వారైనా సరే, ఇంటి స్థలం లేనివారికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇక్కడి భూదాన్ భూముల్లో 311 మంది కి ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు చెప్పారు.

మరో 100 మంది తమకు సొంత స్థలం ఉందని.. ఇందిరమ్మ ఇల్లు -మంజూరు చేశామని చెప్పారు. వెలుగుమట్ల భూ ముల విషయంలో కొందరు మొసలి కన్నీరు కార్చారని, పదేళ్లు అధికారంలో ఉండి పేదలకు ఇంటి పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. వెలుగుమట్లలో అన్ని వసతులను కల్పిస్తామని అన్నారు.