12 March, 2026 | 8:56 AM

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

12-03-2026 01:21 AM

చెన్నూర్, మార్చి 11 : గుడుంబాను అరికట్టడమే లక్ష్యంగా చెన్నూర్ నియోజకవర్గంలోనీ కోటపల్లి మండలం అల్గాం గ్రామంలో బుధవారం పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించాయి. గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో గడపగడపకూ తనిఖీలు చేపట్టిన అధికారులు, గుడుంబా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దాదాపు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పారబోశారు.

గుడుంబా విక్రయిస్తున్న నలుగురు మహిళల నుంచి 70 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని, వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ హరి వెల్లడించారు. ప్రజల సహకారంతోనే గుడుంబాను నియంత్రించ వచ్చునని చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ సమ్మయ్య, కోటపల్లి ఎస్త్స్ర రాజశేఖర్, ఎక్సైజ్ ఎస్త్స్ర వెంకట రమణ, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.