దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మంత్రి కొండా సురేఖ
మహబూబాబాద్, మే 2 (విజయక్రాంతి): దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవి ంచే విధంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే అనేక కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో జిల్లా సంక్షేమశాఖ అధికారిని బి. రాజమణి అధ్యక్షతన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన దివ్యాం గులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మె ల్యే కె.ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, తెలంగాణ దివ్యాంగుల సహకార సంఘం చైర్మన్ ముత్తినేని వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ అభినందనీయమని తెలిపారు.
దివ్యాంగులు తమ పరిమితులను దాటుకుని అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. గతంలో చదువుకున్న వారికి మాత్రమే వాహనాలు అందిం చేవారని, ఇప్పుడు అందరికీ అందేలా చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు సంపూర్ణ భరోసా ఇస్తోందని, వారు ఎక్కడా నిరుత్సాహపడొద్దన్నారు.
దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీ వించేలా ప్రభుత్వం పనిచేస్తోందని, త్వరలో ఇందిరమ్మ ఇళ్లను కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26 రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, 7 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైయిర్లు, డిగ్రీ విద్యార్థులకు 2 ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ పాల్గొన్నారు.






