10 July, 2026 | 2:03 PM

ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

10-07-2026 01:12 PM

జగన్నాథపురం: ఖమ్మం జిల్లాలో(Khammam District) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పర్యటించనున్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. నేడు రైతుల ఖాతాల్లో తుదివిడత రైతు భరోసా నిధులు వేయనున్నారు. సీఎం రేవంత్ రైతులకు ఈ-పట్టాదార్ పాస్ బుక్ లు జారీ చేయనున్నారు. జూ్ 30న వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలను సీఎం ప్రారంభించారు. రైతు ఖాతాల్లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లను ప్రభుత్వం జమ చేసింది. సీఎం పర్యటన దృష్ట్యా ఖమ్మ- బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.