3 May, 2026 | 1:24 AM

రాష్ట్రంలో 7 వరకు వర్షాలే!

03-05-2026 12:00 AM
  1.   8 నుంచి 14వరకు అధిక ఉష్ణోగ్రతలు
  2. మెన్‌దోరాలో 46.0 డిగ్రీలు నమోదు
  3. జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచన

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈనెల 7వ తేదీ వరకు వర్షాలు కురువనున్నాయి. రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని, ఆతర్వాత నాలుగు రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ జిల్లా మెన్‌దోరాలో అత్యధికంగా 46.0 డిగ్రీల ఉష్ణోగ్రత శనివారం నమోదైంది.

ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇక ఈనెల 8 నుంచి 14 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈనెల 7 వరకు, ఆతర్వాత 15 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశముంది. ఎండల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్రం కూడా పలు సూచనలు జారీ చేసింది.