10 July, 2026 | 1:15 PM

ఫిలింనగర్‌లో నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

10-07-2026 12:15 PM

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో(Film Nagar) అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారు నడపడంతో ధర్మ ఇంట్లోకి దూసుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు ఇంట్లోకి దూసుకొచ్చిన ఘటనపై ధర్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు కారు నడిపిన యువకులను అదుపులోకి తీసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఢీకొట్టడంతో గొడ కూలిపోయింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.