నేను ఎవరో పలికిస్తే పలికే వ్యక్తిని కాదు: ఈటల సంచలన వ్యాఖ్యలు
- ఎల్ నినో హెచ్చరికలు ఉన్నా.. ప్రభుత్వం అప్రమత్తం కాలేదు
- రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు
- ఎవరో ఆడిస్తేనే.. స్క్రిప్ట్ రాసిస్తేనో.. మాట్లాడే వ్యక్తిని కాదు నేను
- మేము స్వయం ప్రకాశకులం.. ఒకరు ఆడిస్తే ఆడం
హైదరాబాద్: కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుపై బీజీపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నాకు తెలంగాణ ఫస్ట్.. తరువాతే పార్టీ.. ఆ తరువాతే వ్యక్తగతం' అన్నారు. తన మాటలు వ్యవసాయం గురించి అవగాహన ఉన్నవారికి అర్థమవుతాయని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలన్నది గతంలో కాంగ్రెస్ ఆలోచన అన్నారు. ఉత్తర తెలంగాణకు నీళ్ల జంక్షన్ మిడ్ మానేరని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరంలో కాంట్రాక్టలు, కమీషన్ల గురించి తాను మాట్లాడటం లేదన్న ఈటల ప్రాజెక్ట్ కట్టడమే తప్పు అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తనపై రకరకాలుగా మాట్లాడారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చిల్లర మాటలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని వివరించారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఎవరో ఆడిస్తేనే.. స్క్రిప్ట్ రాసిస్తేనో.. మాట్లాడే వ్యక్తిని తాను కాదన్నారు. మేము స్వయం ప్రకాశకులం.. ఒకరు ఆడించినట్లు ఆడే వ్యక్తలం కాదన్నారు.
ఎస్ఆర్ఎస్పీ వచ్చాకే.. మా జిల్లాలో వ్యవసాయం పెరిగింది
బీజేపీ ప్రాథమిక హక్కుగా కాళేశ్వరం అంశాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రాజెక్టులు, జల వివక్షపై ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోరాడిన వ్యత్తినన్నారు. కాకతీయుల చెరువుల కింద వ్యవసాయం చేసుకున్న వాళ్లం మేము అన్న ఈటల రాజేందర్ ఎస్ఆర్ఎస్పీ వచ్చాకే.. మా జిల్లాలో వ్యవసాయం పెరిగిందని వెల్లడించారు. కాళేశ్వరం కంటే ముందే.. ఇక్కడ జలయజ్ఞం జరిగిందని తెలిపారు. జలయజ్ఞంలో భాగంగా ఆనాడు వైఎస్ఆర్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేపట్టారని వివరించారు.
ఎంఎండీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టిందని ఈటల వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ గురించి అవగాహన ఉన్న వాళ్లకు అన్ని తెలుస్తాయన్నారు. ఎల్ నినో హెచ్చరికలు ఉన్నా.. ప్రభుత్వం అప్రమత్తం కాలేదని మండిపడ్డారు. ఇవాళ నీళ్లు ఇవ్వాలని నే ను కేసీఆర్ ను ఆడగను అని ఈటల తెలిపారు. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న సీఎంనే అడుగుతానన్నారు. అన్నారం, సుందిళ్ల వినియోగం గురించి విశ్రాంత ఇంజినీర్లతో చర్చించాలని ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరని చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మాత్రమే కాదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.






