10 July, 2026 | 1:20 PM

ఎస్సీ వసతి గృహ వార్డెన్ మమత సస్పెండ్

10-07-2026 12:16 PM

బాన్సువాడ, జూలై 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహ వార్డెన్ మమతను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వుల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో వార్డెన్ నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ లు విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం వార్డెన్ మమతను సస్పెండ్ చేశారు.