నిర్లక్ష్యానికి పాల్పడిన బాన్సువాడ ఎంపీఓపై వేటు
10-07-2026 12:18 PM
హైదరాబాద్ పంచాయతీరాజ్ కార్యాలయానికి సరెండర్..
బాన్సువాడ, జూలై 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎం పి ఓ నాగరాజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో పురోగతిని సరిగా పర్యవేక్షించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి గురువారం సాయంత్రం సరెండర్ చేయడం జరిగిందని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పురోగతిపై ఆయన సక్రమంగా దృష్టి పెట్టలేదని, పై అధికారుల ఆదేశాలను పాటించలేదని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.






