4 July, 2026 | 10:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

30-10-2025 10:08 PM

జిల్లాలో కొనుగోలు కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలి*

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మొంధా తుపాన్ ముందు, తర్వాత కురిసిన భారీ వర్షానికి జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న తదితర రైతాంగం తమ పంటలు తీవ్రంగా నష్ట పోయారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వల్ల ప్రైవేట్ వ్యాపారుల చేతిలో మోసాలకు గురికావాల్సి వస్తుందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. 

ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం ఏఐయుకేస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్ర వెంకన్న అమర్లపూడి రాము మాట్లాడుతూ జిల్లా లో కురిసిన వర్షాల కారణంగా రైతులకు చేతికి వచ్చిన పంటలు భారీగా  దెబ్బతిని రైతులు నష్ట పోయినరన్నారు. వారిని ప్రభుత్వ వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు  నష్టపోయిన రైతన్నకి ఎకరాకి రూ 50 వేల  నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. తడిసిన, మొలకెత్తైన, రంగు మరిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన  మద్దతుధర ప్రకారమే కొనుగోలు చెయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజు, కల్లూరి కిషోర్, బానోత్ ధర్మ, పండూరి వీరబాబు, కిసరి వెంకటేష్, బైరు వెంకన్న,నకిరికంటి నాగేశ్వరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.