పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం
పభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 20: పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ ద్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణం,మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ.. యాదగిరిగుట్టలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
దీనిని సంవత్సరంలో పూర్తిగా నిర్మాణం చేసుకొని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి ఆవిష్కరించారు.3వ వార్డుల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. యాదగిరిగుట్టలో బస్టాండ్ దగ్గర పాత గుట్ట చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. యాదగిరిగుట్టలో రెండు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ రమ్య రామచంద్రర్,కౌన్సిలర్లు బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముక్యర్ల మల్లేష్ యాదవ్, బిట్టు సరోజ, దాతర్ పల్లి సర్పంచ్ కాల్నే సరిత భాస్కర్, వార్డు సభ్యులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






