స్నేహిత హిల్స్‌లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించండి
ప్రజావాణిలో సమస్యలపై డీసీకి కాలనీ వాసులు ఫిర్యాదు
రాజేంద్రనగర్ ఏప్రిల్ 20 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండల పరిధిలోని స్నేహిత హిల్స్ లో నెలకొన్న సమస్యలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. కాలనీలో కనీస సౌకర్యాలు రోడ్లు డ్రైనేజీ తాగునీరు వీధి దీపాలు లేక ప్రజలు బిక్కుబిక్కుమంటు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సోమవారం ప్రజావాణిలో భాగంగా బండ్లగూడ జాగిర్ లోని రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డిని కలిసి కాలనీవాసులు సమస్యలపై వినతి పత్రం అందజేశారు .
కాలనీలో పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు జరుగుతున్నాయని పన్నుల రూపంలో ప్రజలుప్రభుత్వానికి ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ సౌకర్యాలు మాత్రం కల్పించడం లో అధికారులు విఫలం అయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేకే మూర్తి. రవీందర్ రెడ్డి ఎం భాస్కర్ రెడ్డి. పార్థ రెడ్డి . సుదేశ్ తదితరులు ఉన్నారు.






