8 April, 2026 | 5:21 AM

ప్రతిధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

08-04-2026 01:13 AM

ఎమ్మెల్యే మందుల సామెల్ 

తుంగతుర్తి, ఏప్రిల్ 7 : కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామెల్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డును అందించలేదని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్నారు.

రైతులు గిట్టుబాటు ధర పొందాలంటే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందించే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలని అన్నారు. నియోజకవర్గ పరిధిలో 20040 మంది సీఎంఆర్ చెక్కుల గాను సుమారు 80 లక్షల పైచిలుకు చెక్కులను పంపిణీ చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా త్వరలోనే ఎస్‌ఆర్‌ఎస్పి జలాలను సంబంధిత మంత్రితో ఫోన్లో  మాట్లాడి విడుదలకు కృషి చేస్తానన్నారు.   

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,  తాహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏ రమేష్ బాబు, కోపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్  ఎస్ కే బడే సాబ్, సొసైటీ సీఈవో యాదగిరి,తుంగతుర్తి సింగిల్ విండో మాజీ చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి,మద్దిరాల, నూతనకల్, నాగారం, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దొంగరి గోవర్ధన్, జిల్లా నాయకులు రేగటి రవి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బికోజి,తుంగతుర్తి పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, పచ్చిపాల సుమతి, దాయం ఝాన్సీ రాజిరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, , తదితరులు పాల్గొన్నారు.