రైతులందరికీ యూరియా అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం
తాడ్వాయి, జూన్ 18 (విజయక్రాంతి): రైతులందరికీ అవసరమైన యూరియా అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి సంజీవులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం రైతులకు అందరికీ అవసరమైన యూరియా సమపాళ్లలో అందించాలనే లక్ష్యంతోనే ప్రత్యేకంగా ప్రభుత్వం యూరియా యాప్ ను తీసుకువచ్చిందన్నారు.
ఈ యాప్ ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులకు అవసరమైన యూరియా ను ప్రభుత్వం అందించడానికి ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. గతంలో రైతులు చనిపోయిన పట్టించుకోని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతం లేని పోనీ విమర్శలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సర్వర్ పనిచేయని సమయంలో కొన్ని సందర్భాల్లో రైతులకు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. కానీ అనవసరంగా రైతులు రెచ్చగొడుతూ ప్రతిపక్ష నాయకులు ఇబ్బందులు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్ది మహేందర్ రెడ్డి,షౌకత్ అలీ, వెంకట్ రెడ్డి,రాజిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.






