9 May, 2026 | 4:31 AM

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

09-05-2026 12:00 AM

అవగాహన శిబిరంలో కలెక్టర్ ప్రతీక్ జైన్

చౌటకూరు(సంగారెడ్డి), మే 8 : పాడి పరిశ్రమ రైతులకు స్థిరమైన అదనపు ఆదాయ వనరుగా మారాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుకూరు మండలం సరాఫ్పల్లి గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర పశు సేవలు, పశు చికిత్స మరియు అవగాహన శిబిరంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో పశుసంపద అధికంగా ఉండటం ఆనందంగా ఉందని, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, గ్రామ సర్పంచ్, తహసిల్దార్, రైతులు, పాడి రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.