23 May, 2026 | 4:27 AM

స్వచ్ఛ చేవెళ్లే లక్ష్యం

23-05-2026 12:00 AM

రంగంలోకి దిగి రోడ్లు ఊడ్చిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్

చేవెళ్ల, మే 22 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీలో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ (90 రోజుల కార్యాచరణ) లో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సమత వెంకటరెడ్డి, కమిషనర్ బి. యాదగిరి, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చారు. వీధులు, అంగడి బజార్ ప్రాంతాల్లోని చెత్తను తొలగించారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ‘స్వచ్ఛ చేవెళ్ల’గా మార్చడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం, తదుపరి 99 రోజుల ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం కోసం మహిళా సంఘాల సభ్యులు రంగారెడ్డి కలెక్టరేట్కు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.