23 May, 2026 | 3:17 AM

డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తే..

23-05-2026 12:00 AM

రాజీనామాలకు కూడా సిద్ధపడతాం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలెక్టర్కు వినతిపత్రం

షాద్నగర్ మే22 (విజయక్రాంతి):   కొత్తూరు మండలంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి కేటాయించొద్దు అని డిమాండ్ చేస్తూ కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లారం శేఖర్ రెడ్డి, సీనియర్ నేత, మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల సర్పంచులు ’ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ రంగారెడ్డి జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో స్థానిక ప్రజాప్రతినిధులు తమ నిరసనను గట్టిగా వినిపించారు. అధికారులు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకూడదని, ప్రజల అభీష్టమే పరమావధిగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.దీనికి మద్దతుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలెక్టర్తో మాట్లాడుతూ... ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయిస్తే తామంతా రాజీనామాలకు కూడా సిద్ధపడతామని హెచ్చరించారు. సిద్ధాపూర్ పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.