30 June, 2026 | 10:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం

17-01-2026 04:03 AM

సికింద్రాబాద్ జనవరి 16 (విజయ క్రాంతి) : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి చెందితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎన్ వెంకటేష్ అన్నారు. రోడ్డు ప్రమా దాలను నివారించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ సుబ్బయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ సుబ్బయ్య మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను తప్పని సరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్లు, సురక్షిత ప్రదేశాలను మాత్రమే వినియోగించాలని సూ చించారు.

ఈ సందర్భంగా కంటోన్మెంట్ డిపో, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయాలలో అధికారులు, సిబ్బందితో ఇన్‌స్పెక్టర్ ప్రమాణ పత్రంతో చదువుతూ వారి చేత, ‘నేను ట్రాఫిక్ భద్రతానియమాలు పాటిస్తా. హెల్మెట్, సీటుబెల్ట్ ధరిస్తా. మద్యం తాగి వాహనం నడపకుండా ఉంటా. నా ప్రాణం కాపాడుకుని, ఇతరుల ప్రాణాలు  కాపాడుతా. ప్రమాదాలను నివారిస్తా’ అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ, కంటోన్మెంట్ బోర్డ్ జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.