calender_icon.png 19 February, 2026 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకమత్యాన్ని పెంపొందించడమే లక్ష్యం

19-02-2026 01:30:40 AM

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): నిరంతరం శాంతిభద్రతల బాధ్యతలతో నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహం, ఐకమత్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోరట్స్ అండ్ గేమ్స్ మీట్2026 బుధవారం సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలకు శ్రీకారం చుట్టారు,

ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతంతో మైదానం రాష్ట్ర స్ఫూర్తితో మారుమోగగా, గన్ ఫైర్, బెలూన్ల విడుదల మధ్య క్రీడల ప్రారంభోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. కార్యక్రమం లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, స్పోర్స్ ఐజీ డాక్టర్ గజరావు భూపాల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, ఏడీజీపీ మహేశ్ మురళీధర్ భగవత్, ఏడీజీపీ అనిల్ కుమార్, ఏడీజీపీ విజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, సైబరాబాద్ డీసీపీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.