calender_icon.png 19 February, 2026 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడవటంచ జాతరకు పటిష్ట ఏర్పాట్లు

19-02-2026 01:30:31 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ప్ర సిద్ధిగాంచిన కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వ హించే జాతర, విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు.

బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ తో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్ష ని ర్వహించారు. బుధవారం నుండి 21 వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ పునః ప్రతిష్టాపన, 26 నుండి మార్చి 5 వరకు బ్ర హ్మోత్సవాలు జాతర నిర్వహించడానికి ఏ ర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 21న కొడవటంచ ఆలయానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు స్వామి దర్శనానికి రానున్నట్లు చెప్పారు.

కొడవటంచ ఆలయ పున ర్నిర్మాణానికి ఈ ఏడాది అదనంగా 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, తాత్కాలిక బస్టాం డు ఏర్పాటు చేసి పరిసర జిల్లాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి వెళ్లే విధంగా సర్వీసులు నడపాలని సూచించారు. భక్తులకు వైద్య, తాగునీటి, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రైవేటు వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతర జరిగే రోజుల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. 

అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఆలయ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం పండగ వాతావరణంలో పునర్నిర్మాణం జరిపిన ఆలయం వద్ద గుమ్మడికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.