27 June, 2026 | 2:37 AM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

27-06-2026 12:00 AM

ఉత్సాహంగా సాగిన 5కే రన్

ఆదిలాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : డ్రగ్స్ రహిత సమా జ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఏ టా జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లాలో ఉత్సహ భరిత వాతావరణంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 5k రన్ కు విశేష స్పందన లభించింది. శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు బండారి అనూష సతీష్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో సాగిన 5k రన్ స్టేడియం నుంచి పట్టణ పురవీధుల గుండా సాగింది. ముందుగా ఈ రన్ ను అథితులు జెండా ఊపి ప్రారంభించారు.  అనంతరం రన్ లో విజేతలుగా నిలిచిన పది మందికి సైకిళ్లను, అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ... యువత మత్తుకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.

దేశానికి వెన్నుముకైన యువతను డ్రగ్స్ బాదితులుగా మార్చి దేశాన్ని విచ్చిన్నం చేసేల కుట్ర జరుగుతుందని, దీని పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి అందుబాటులో ఉండటంతో యువత వాటి బారిన పడి తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని గుర్తు చేశారు.ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... గంజాయి రహిత జిల్లా నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడమే కాకుండా వాటి అక్రమ రవాణ, విక్రయాలపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తు సహకారించాలని కోరారు. చెడు వ్యాసానాల బారిన పడిన వారిని గుర్తించి చికిత్సలు అందించేల కృషి చేయడం కూడా సామాజిక బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు చదువుపై దృష్టి సారించి దేశానికి బలమైన శక్తిగా నిలవలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు మౌనిక, సురేందర్రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కోట్టే. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్. ఎఫ్‌ఎఓ విశ్వనాథ చినబూసరడ్డీ, డీడబ్ల్యూఓ మిల్క, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్డ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీవైఎస్‌ఓ దయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.