ఫ్రీ ప్రైమరీ స్కూళ్లకు ఇన్స్‌స్ట్రక్టర్, ఆయాల నియామకం
27-06-2026 12:00 AM
నాగిరెడ్డిపేట, జూన్ 26 (విజయక్రాంతి): మండలంలోని జప్తి జానకంపల్లి, మేజర్ వాడి,లింగంపల్లి కాలన్ గ్రామాల్లో మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ఇన్స్ట్రక్టర్,ఆయాలను నియమించినట్లు మండల విద్యాధికారి వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఆయా గ్రామాల్లో నియమితులైన ఇన్స్ట్రక్టర్, ఆయాలు విధుల్లో చేరారని పేర్కొన్నారు.
జప్తి జానకంపల్లి ఇన్స్పెక్టర్గా మునెమ్మ, ఆయాగా మహేశ్వరి,మేజర్ వాడి గ్రామ ఇన్స్పెక్టర్గా సరోజ, ఆయాగా రేణుక, లింగంపల్లి కాలన్ గ్రామ ఇన్స్పెక్టర్గా శరణ్య, ఆయాగా సునీతలను నియమించినట్లు తెలిపారు. నియమితులైన వారు ఆయా గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో విధుల్లో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తదితరులు పాల్గొన్నారు






