2 July, 2026 | 3:02 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

కాలేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక చెత్తబుట్టలో వేయాలి

23-04-2026 12:22 AM

బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, ఏప్రిల్ 22: కాలేశ్వరం ప్రాజెక్టుపై పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేయాల్సిందేనని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు స్టే ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. కాలేశ్వరం పై అవినీతి ఆరోపణలు అసత్యమని, కమిషన్ నివేదిక ఫేక్ అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలమైందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.