2 July, 2026 | 4:13 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

హైకోర్టు తీర్పుతో కాళేశ్వరంపై నిజం గెలిచింది

23-04-2026 12:22 AM

మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి

జడ్చర్ల, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధిం చి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రాష్ట్ర మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఒక ప్రకటన లో మాజీ మంత్రి మాట్లాడారు కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందన్నారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొం దారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. న్యాయస్థానాలపై నమ్మకంతో కేసీఆర్, హరీష్ రావు పోరాడగా చివరకు నిజం గెలిచిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు కోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్, బీజేపీలకు కనువిప్పు కలగా లని మాజీ మంత్రి ఆకాంక్షించారు.