యావపూర్ బస్టాండ్‌లో చలివేంద్రం ప్రారంభం
23-04-2026 12:20 AM
తూప్రాన్, ఏప్రిల్ 22 : తీవ్ర ఎండలు కాస్తున్న నేపథ్యంలో వేసవిలో బాటసారుల ప్రయాణికుల దాహార్తిని తీర్చుటకు తూప్రాన్ మండలం యావపూర్ గ్రామ సర్పంచ్ యంజాల స్వామి యావపూర్ బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన చిన్నారుల కార్యక్రమాల్లో పాల్గొని చిన్నారులు చేసిన నృత్యాలను వీక్షించి ప్రశంసించారు. ఇందులో గ్రామ సెక్రెటరీ, ఉపసర్పంచ్, పాలకవర్గం సభ్యులు, చెట్లపల్లి రామస్వామి, రామని స్వామి, జింక మల్లేష్, వెంకటాయపల్లి నరసింహ, వెంకటయపల్లి కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






