20 March, 2026 | 9:52 AM

త్వరలోనే గ్యాస్ సమస్య పరిష్కారం

20-03-2026 12:00 AM
  1. జీ-20 దేశాల్లో 20 నుంచి 50 శాతం పెరిగిన ధరలు
  2. మనదగ్గర స్థిరంగానే ధరలు 
  3. ఇప్పటికే 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్‌కు చేరింది
  4. గ్యాస్ పట్ల మహిళలు ఆందోళన చెందొద్దు
  5. ఉగాది వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో జీ దేశాల్లో గ్యాస్ ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగాయని, కానీ, భారతదేశంలో మాత్రం ప్రధాని నరేంద్రమోదీ అత్యున్నత దౌత్య నీతి వల్ల ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు.

దేశంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత ఎక్కడా లేదని, కమర్షియల్ గ్యాస్ విషయంలో ఉన్న స్వల్ప కొరతను (30-40 శాతం) కూడా దిగుమతి చేసుకున్న నౌకల రాకతో త్వరలోనే పూర్తిగా పరిష్కారమవుతుందని స్పష్టంచేశారు. దేశం లో గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, ఇప్పటికే 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో కూడిన భారీ నౌకలు సు రక్షితంగా భారత్‌కు చేరుకున్నాయని తెలిపా రు. వివిధ పోర్టుల ద్వారా ఈ గ్యాస్ ఇప్పటికే సరఫరా వ్యవస్థలోకి చేరిందన్నారు.

గురువా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పం చాంగ శ్రవణం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, రాష్ట్ర సం స్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం సుఖఃశాంతులను, అభివృద్ధిని చేకూ ర్చాలని ఆకాంక్షించారు. గ్యాస్ పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలెవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని చెప్పారు.

వ్యూహాత్మక కేంద్రాల్లో సిద్ధంగా ముడి చమురు

అంతర్జాతీయ ఉద్రిక్తతలను ముందే ఊహించిన మోదీ ప్రభుత్వం, అత్యవసర పరిస్థితుల కోసం వ్యూహాత్మక నిల్వ కేంద్రా ల్లో (ఎస్‌పీఆర్) దాదాపు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును సిద్ధంగా ఉంచిందని, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేశ అవసరాలకు ఎక్కడా డోకా లేదని రాంచందర్‌రావు వెల్లడించారు. ప్రపంచవ్యాప్త యుద్ధ పరిస్థితులను ధీటుగా ఎదు ర్కొని, దేశాన్ని సశ్యశ్యామలంగా తీర్చిదిద్దుకునే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.

రాబోయే కాలం అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని ఆశాభా వం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో ప్రపం చం సాంకేతిక రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణులు, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని వెల్లడించారు.