9 May, 2026 | 2:20 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

అమీనాబాద్‌లో ఘనంగా గంగమ్మ జాతర

09-02-2026 12:00 AM

కోదాడ (అనంతగిరి)ఫిబ్రవరి 8: అమీనాబాద్ గ్రామంలో గ్రామదేవత గంగమ్మ జాతరను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలు నిర్వహించగా భక్తులు తరగని భక్తిశ్రద్ధలతో అమ్మవారినిదర్శించుకున్నారు.

జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులను చల్లగా చూడాలని, పంటలు పండాలని, గ్రామానికి ఎలాంటి అపశ్రుతులు లేకుండా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఈ జాతరనునిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.

జాతర శాంతియుతంగా ముగియడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముత్తినేని కోటేశ్వరావు,చిత్తలూరి వెంకటేశ్వర్లు ,గోపతి సత్యనారాయన ,గోపతి వెంకటేశ్వర్లు, కీత లష్మినారాయణ ,గోపతి సురేష్ ,అరేపూడి వెంకటేశర్లు ,గోపాతి చిన్న వెంకటేశ్వర్లు, బత్తుల ఉప్పలు పాల్గొన్నారు.